19 August, 2026 | 9:16 PM

సమాజాన్ని జాగృత పరిచేవాడు జర్నలిస్ట్

19-08-2026 06:30 PM

ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కరీంనగర్ లో బుధవారం 28 వ బ్యాచ్ జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ వీడ్కోలు కార్యక్రమం, సర్టిఫికెట్స్ ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్  టి.రాజయ్య  ప్రారంభించి మాట్లాడుతూ జర్నలిజం అనేది నిస్వార్థ వృత్తి అని, జర్నలిస్టుకు భాషా పరిజ్ఞానం అవసరం అన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్  కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జర్నలిజం అనేది లాభాపేక్ష లేని వృత్తి అన్నారు. కళాశాల ఐక్యూఏసి ఇంచార్జ్ డా. హర్జ్యోత్ కౌర్  మాట్లాడుతూ ఆదర్శనీయమైన జర్నలిస్ట్ వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.   అనంతరం ముఖ్య అతిథులు, వైస్ ప్రిన్సిపాల్స్ వారి చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు.ఈ కార్యక్రమంలో తెలుగు విభాగ అధ్యాపకులు బూర్ల వేంకటేశ్వర్లు  విద్యార్థులు పాల్గొన్నారు.