కామారెడ్డిలో వెంకటేశ్వరా హీరో షోరూం
30-05-2026 01:29 AM
సరికొత్త హంగులతో రెనోవేషన్
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి సారిగా, ప్రస్తుత కాలానికి అనుగుణంగా వెంకటేశ్వరా హీరో షోరూంను సరికొత్త హంగులతో రేనోవేషన్ చేశారు. యువతను మెప్పించే అత్య ధునాతన టెక్నాలజీతో రూపొందించిన ప్రీమియం వెహికల్స్ డెస్టినీ 125, ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, మేవ్రిక్ 440 ఇంకెన్నో వాహనాలతో ముందుకు వచ్చింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హీరో ఏరియా మేనేజర్ గణేష్, దీపక్, జగదీశ్, నవీన్, షోరూం యజమాని నల్ల మహిపాల్‌రెడ్డి, నల్ల జయరెడ్డి, చంద్ర హీరో కంపెనీ టీం మెంబర్స్, షో రూం సిబ్బంది పాల్గొన్నారు. మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. హీరో వెహికల్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అన్ని వయసుల వారిని ఆకర్షించే విధంగా రూపొందించారని తెలిపారు.






