1 August, 2026 | 9:30 PM

బోనాల ఉత్సవాలకు చెక్కుల పంపిణి

01-08-2026 08:29 PM

‎కూకట్ పల్లి,(విజయక్రాంతి):  హైదరాబాద్ నగరం లో ప్రతీ సంవత్సరం ఆషాడ మాసం లో ఘనంగా  జరిగే బోనాల పండుగ పురస్కరించుకుని కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని 138 ఆలయ కమిటీ సభ్యులకు శనివారం చెక్కులను పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టిఫిసిసి ఉపాధ్యక్షులు బండిరమేష్ లు ముఖ్య అతిధులు గా హాజరై ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అన్నారు.జగజ్జనని అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

ముఖ్య మంత్రి ఎనుముల  రేవంతరెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ముందుకు సాగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తుందని తెలిపారు.ఆలయాల అభివృద్ధికి,ఆధ్యాత్మిక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఆలయ కమిటీ ల అధ్యక్షులు,బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.