1 August, 2026 | 9:30 PM

వర్షాలు సమృద్ధిగా కురవాలి.. పంటలు బాగా పండాలి

01-08-2026 08:27 PM

* భద్రాచలంలో జక్కు సోదరుల ప్రత్యేక పూజలు

​ఆమనగల్లు,(విజయక్రాంతి): రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అమనగల్ మండల మాజీ వైస్ ఎంపీపీ శ్రీ జక్కు అనంతరెడ్డి  భద్రాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ​శ్రీ సీతారామచంద్ర స్వామివారిని తన సోదరుడు శ్రీ జక్కు విజయరెడ్డి మరియు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఆయన, ఆలయంలో ప్రత్యేక అర్చనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి వేదాశీర్వచనం తో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, రైతాంగం సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా జక్కు అనంతరెడ్డి ఆకాంక్షించారు.