1 August, 2026 | 9:29 PM

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

01-08-2026 08:33 PM

కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని జడ్చర్ల-కోదాడ జాతీయ రహదారి రక్తసిక్తమైంది.  వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్నగర్ మండలం బూరుగడ్డ కు చెందిన  గడ్డం లోకేష్, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటకు చెందిన అనిల్ ఇద్దరూ జగ్గయ్యపేటలోని ఓ ఆసుపత్రిలో కాంపౌండర్లుగా పనిచేస్తున్నారు. ఇరువురు కలిసి  మఠంపల్లిలో ఓ శుభకార్యానికి హాజరైయ్యారు. తిరుగు ప్రయాణంలో స్కూటీపై కోదాడ వైపు వస్తుండగా కవిత ఇంటర్ కళాశాల వద్దకు రాగానే అతివేగంగా ప్రయాణిస్తున్న యువకులు అకస్మాత్తుగా ముందు బ్రేకు వేశారు.

ఈ క్రమంలో ద్విచక్ర వాహనం  రహదారిపై పల్టీలు కొట్టింది. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో ప్రమాధం చిరుకూరు మండలం సీతారామపురం స్టేజి వద్ద చోటుచేసుకుంది. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన భూక్య నరసింహ, బోజ్య తండకు చెందిన గోపి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంను బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భూక్య నరసింహ అక్కడక్కడే మృతిచెందగా గోపి తీవ్ర గాయాలతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదలకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ఒకేరోజు ముగ్గురు యువకులు మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.