calender_icon.png 19 February, 2026 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూరగాయల మార్కెట్ వినియోగంలోకి తేవాలి

19-02-2026 01:29:06 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పెండింగ్ పనులను పూర్తి చేసి నెల రోజుల లోపు వినియోగంలోకి తీసుకురావాలని సిపిఐ వార్డు కౌన్సిలర్ అజయ్ సారధి రెడ్డి డిమాండ్ చేశారు.

గాంధీ పార్క్ ఆవరణను వినియోగంలో తెచ్చి శ్రీరామ క ళ్యాణ మహోత్సవం అందులోనే నిర్వహించేలా ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయ క్, మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అసంపూర్తిగా వదిలేసిన ఇంటిగ్రేటెడ్ మార్కె ట్ ను వ్యాపాలతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లకు పైగా నాన్చుతున్న కొత్త కూరగాయల మార్కెట్ ను తక్షణమే వినియోగంలో తీసుకురావాలని నిరసన తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం తాత్కాలికంగా 2021లో గాంధీ పార్క్ లో ఏర్పాటు చేసినారు 2023 లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసంపూర్తి పనులతోనే ప్రారంభించిందని, కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 025లో ఒక కోటి రూపాయలు నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే చెప్పారని, అయితే అందులో కేవలం 50 లక్షల రూపాయల సంబంధిత పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఈ విషయమై కాంటాక్ట్ ను ప్రశ్నిస్తే చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో మిగిలిన పనులు చేయకుండా వదిలేశానని చెప్పినట్లు తెలిపారు.

గేట్లు, పార్కింగ్ ప్లేస్, టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం లాంటి పనులు తక్షణమే పూర్తి చేయాలన్నారు. మహబూబా బాద్ పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించే శ్రీరామ కళ్యాణ మహోత్సవము రోడ్లపైనే నిర్వహిస్తున్నారని, గతంలో గాంధీ పార్క్ లో అంగరంగ వైభవంగా నిర్వహించే ఆవరణలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు తర్వాత రోడ్డుపైనే శ్రీరామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా నైనా మార్కెట్ పనులు పూర్తి చేసి గాంధీ పార్క్ లోనే మార్చి 26 లోపు శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిసగాని కుమార్, చీకటి తిరుమలేష్, మేదరమెట్ల వెంకట్ రాములు, గుర్రాల వెంకన్న, రాంబాబు, శ్రీరామ్ కిరణ్, రుద్ర గాని శ్రీనివాస్, కవిత, పద్మావతి, వీరన్న, వీణ, అశోక్ గౌడ్, సాయి, యూసఫ్, సిపిఐ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వెలుగు శ్రావణ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.