26 July, 2026 | 1:55 AM

రాజన్న క్షేత్రంలో వేద విద్వత్ సదస్సు

26-07-2026 12:57 AM
  1. 95 శాతం ఉత్తీర్ణతతో మెరిసిన విద్యార్థులు
  2. ఐదు ఎకరాల్లో నూతన వేద పాఠశాల
  3. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, జూలై 25 (విజయక్రాంతి): వేద సంస్కృతి పరిరక్షణకు, వేద విద్య అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల భారత వేద--శా--స్మార్త--ఆగమ విద్వత్ సదస్సు, వేద--స్మార్త పరీక్షా మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి.

ఈ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేములవాడలో సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని పరిశీలించి, నూతన వేద, సంస్కృత పాఠశాల భవనాల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి ఈ నిర్మాణ పనులను పూర్తి చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.  మొత్తం 130 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 124 మంది ఉత్తీర్ణత సాధించారు. వేములవాడలో జరిగిన ఈ వేద మహోత్సవాలు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచాయని నిర్వాహకులు పేర్కొన్నారు.