25 April, 2026 | 4:46 PM

వాసవి మాత భూమి పూజ కార్యక్రమం విజయవంతం చేయాలి

25-04-2026 02:57 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి పట్టణ కేంద్రంలో వాసవి మాత ఆలయం సమేత నగేశ్వర స్వామి, విగ్నేశ్వరుడు ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం నాయకులు కోరారు. శనివారం గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత ఫ్లెక్సీకి ఆర్యవైశ్యులు పాలాభిషేకం నిర్వహించారు.

ప్రభుత్వం ఆర్యవైశ్యుల కుల దేవత అయిన వాసవి మాత జయంతిని అధికారికంగా ప్రకటించడం, హర్షించదగ్గ విషయమని, జయంతిని అధికారికంగా మార్చడానికి కృషి చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, ముఖ్యమంత్రి ,మంత్రిమండలి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం 8గంటల నుండి 11 గంటల వరకు తుంగతుర్తి లోనే నూనె మిల్లు ప్రక్కనగల వాసవి మాత భూమి పూజలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద పండితుల నడుమ నిర్వహించబడును.

కావున సకాలంలో రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ మండలస్థాయి ఆర్యవైశ్య బంధుమిత్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం నాయకులు ఈగ నాగన్న, ఓరుగంటి అంతయ, తాటికొండ సీతయ్య, పోలవరపు సంతోష్ ఈగల లక్ష్మయ్య శరీరాల మల్లయ్య, బుద్దా వీరన్న, మాశెట్టి వెంకన్న, గోపారపు సత్యనారాయణ, గుండా శ్రీనివాస్ బండారు నాగన్న, తల్లాడ శ్రీను, ఓరుగంటి సుభాష్ ఓరిగంటి శ్రీను, తల్లాడ చుక్కయ్య, ఈగ సోమయ్య, రామ నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.