22 August, 2026 | 3:22 AM

ఘనంగా ముగిసిన వరలక్ష్మి వ్రత మహోత్సవం

22-08-2026 01:34 AM

పెబ్బేరు, ఆగస్టు 21: పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో వరలక్ష్మీ వ్రత మహోత్సవాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు నిర్వహించి, మహిళలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు.

అర్చకులు వెంకటేశ్వర్లు శర్మ వ్రత విశిష్టతను వివరించారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవ, భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు వెంకటేశ్వర్లు శర్మను సన్మానించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.