27 August, 2026 | 9:29 PM

పెన్షన్స్ సేవలు జాప్యం లేకుండా అందిస్తాం

27-08-2026 08:25 PM

- సీఎం పీఎఫ్ రీజనల్ కమిషనర్లు

- మందమర్రి జిఎం ఆఫీసులో సమీక్ష

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మందమరి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో సీఎంపిఎఫ్ సమీక్ష సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం పిఎఫ్ రీజనల్ కమిషనర్లు (రీజన్-2) వై. భారత్ కుమార్,గోవర్ధన్ మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులకు సీ.ఎం.పి.ఎఫ్ (CMPF) పెన్షన్ సేవలను ఎలాంటి జాప్యం లేకుండా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. సి-కేర్స్ (C-CARES) పోర్టల్: సీ.ఎం.పి.ఎఫ్, పెన్షన్ లావాదేవీలన్నీ సంపూర్ణంగా సి-కేర్స్ డిజిటల్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తుమన్నారు.

ప్రయాస్’ విధానం తో కొత్తగా పెన్షన్ క్లెయిమ్‌లను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ‘ప్రయాస్’ అనే నూతన పద్ధతిని అమలులోకి తెచ్చారనీ తెలిపారు. జీరో పెండింగ్ (Zero Pending): కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు క్లెయిమ్‌లన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ‘జీరో పెండింగ్’ లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఏరియా లో ఉన్న సంక్షేమ అధికారులు వారి వారి గనులలో పెండింగ్ లో ఉన్న పిఎఫ్, పెన్షన్స్ క్లెయిమ్స్ త్వరగా క్లియర్ చేయాలని కోరామని తెలిపారు. 

సీఎం పిఎఫ్ రీజినల్ కమిషనర్  పెండింగ్ లో ఉన్న ప్రతి క్లైమ్ ను త్వరగా పరిశీలించి క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారనీ తెలిపారు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కార్మికులు నేరుగా సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నామని, ఉద్యోగులెవరూ ఇబ్బంది పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భముగా సీ.ఎం.పి.ఎఫ్ రీజినల్ కమిషనర్ వై. భరత్ కుమార్ ని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ, అధికారులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో మందమర్రి ఏరియా డీజీఎం (పర్సనల్) అశోక్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ, సీ.ఎం.పి.ఎఫ్ సిబ్బంది ఎస్ ఎస్ ఏ, అనిత, వరప్రసాద్, వెంకట్ రెడ్డి, వివిధ గనుల సంక్షేమ,సింగరేణి అధికారులు పాల్గొన్నారు.