26 August, 2026 | 10:15 PM

మంథనిలో వన మహోత్సవ కార్యక్రమం

26-08-2026 08:18 PM

మొక్కలు నాటి.. పర్యావరణాన్ని పరిరక్షించాలి

మంథని మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్‌లో మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ నిర్వహణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పట్టణంలో పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.

మొక్క నాటుదాం–పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐ బి. స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, నూకల కమల్, మాచిడి రాజు గౌడ్, పోతరబోయిన శ్రీలత, వేముల లక్ష్మి, ఎల్లంకి వంశీధర్ తదితరులతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.