13 April, 2026 | 10:54 PM

విజేతలకు బహుమతులు అందజేత

13-04-2026 09:17 PM

కోహెడ: ఎన్టీఆర్ కాలనీలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి పురస్కరించుకొని ఇటీవల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రపటాల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ హాజరైయి విజేతలకు బహుమతులు అందించి మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థుల సృజనత్మతాను పెంపొందిస్తూ.. అవార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులను ప్రొచ్చహించిన డాక్టర్. వేల్పుల శంకర్ ను అభినందించారు.

అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, రాజ నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు. మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు దర్శనాల నారాయణ, ఉపాధ్యాయులు ఎస్ గీత, కే శోభ, వి తిరుమల, రాచూరి మల్లేష్, గ్రామస్తులు నరాల సత్తయ్య, పొన్నాల రవి, తలారి బాబు, పొన్నాల మోహన్, పొన్నాల విజయ్ కుమార్, బి నవీన్ కుమార్ పాల్గొన్నారు.