2 March, 2026 | 4:38 PM

Breaking News

భిక్షాటన చేసిన శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి   •   నాగిరెడ్డిపేటలో అధికారులకు సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ   •   వ్యక్తి హత్య, ముక్కలు ముక్కలుగా చేసి యమునా నదిలో..   •   అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 555 మంది మృతి, రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ యత్నం విఫలం   •   హైడ్రా పేరు.. పెద్దలతో ప్రభుత్వ ఒప్పందం   •   భారత్–కెనడా సంయుక్త ప్రకటన: పశ్చిమాసియా యుద్ధంపై మోదీ ఆందోళన, కీలక ఒప్పందాలు   •   తెలంగాణలో "బుల్డోజర్ రాజ్": కేరళ సీఎం విమర్శలు   •   మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత   •   చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆకాష్   •   అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి   •  

అమెరికా–ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 555 మంది మృతి, రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్ యత్నం విఫలం

02-03-2026 03:11 PM

టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్(US-Israeli Attacks) దాడుల్లో ఇరాన్‌లో ఇప్పటివరకు 555 మంది మృతి చెందినట్లు అమెరికా ప్రకటించింది. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా- ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. కనీసం 555 మంది మరణించినట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ(Iranian Red Crescent Society) వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 131 నగరాలపై దాడులు జరిగాయని సంస్థ పేర్కొంది. అటు చమురు రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లు దాడి భగ్నం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. డ్రోన్ల శకలాలు కిందపడి మంటలు చెలరేగాయని సౌదీ అరేబియా వెల్లడించింది. ఈ ఉదయం రాస్ తనురా రిఫైనరీపై డ్రోన్లతో ఇరాన్ దాడికి యత్నించింది. రెండు డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డ్రోన్లను అడ్డుకునే ఆపరేషన్ లోకిందపడి శకలాల కారణంగా స్వల్పస్థాయిలో మంటలు చేలరేగాయని తెలిపింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది.