11 April, 2026 | 6:18 PM

ఇరాన్‌ కండిషన్స్‌కు ఒప్పుకున్న అమెరికా

11-04-2026 04:23 PM

ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా- ఇరాన్ శాంతి(US Iran Peace Talks) చర్చలకు సర్వం సిద్ధమైంది. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకున్నారు. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(Vice President JD Vance) నాయకత్వం వహిస్తున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశం అయ్యారు. శాంతి చర్చల కోసం ఇరాన్ భారీ ప్రతినిధుల బృందాన్ని పంపింది. 71 మంది ఉన్నతాధికారుల బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. ఈ బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ నాయకత్వం వహిస్తున్నారు.

బృందంలో ఇరాన్ విదేశాంగ మంత్రి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఉన్నారు. చర్చల ప్రారంభానికి ముందే రెండు టెహ్రాన్ రెండు డిమాండ్లు ముందుకు తెచ్చింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆగాలని ఇరాన్ ఖండిషన్ పేర్కొంది. స్తంభింపజేసిన తమ ఆస్తులు విడుదల చేయాలంటూ టెహ్రాన్ షరతులు పెట్టింది. శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ ఒప్పందం కుదరకపోతే శక్తివంతమైన ఆయుధాలతో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌ పెట్టిన రెండు కండిషన్స్‌ అమెరికా ఒప్పుకుంది.