పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
నవాబ్ పేట: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్‌వీఎస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నవాబ్ పేట మండలానికి చెందిన పలువురు రోగులను మాజీ మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి బుధవారం పరామర్శించారు. నవాబ్ పేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాజేందర్ గౌడ్, తీగలపల్లి గ్రామానికి చెందిన ఇందు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఎస్‌వీఎస్ ఆసుపత్రిలో చేరారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు.అనంతరం వారికి అందిస్తున్న చికిత్స వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు.






