calender_icon.png 8 February, 2026 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణాభివృద్ధికి రూ.17వేల కోట్లు

08-02-2026 12:00:00 AM

  1. రెండేళ్లలో ప్రభుత్వం విడుదల చేసిన నిధులు
  2.   130 మున్సిపాలిటీల్లో 3,994 పనులు
  3. మున్సిపల్ శాఖలో కీలక సంస్కరణలు 
  4. పురపాలికలపై సీఎం ఫోకస్

హైదరాబాద్, ఫిబ్రవరి ౭ (విజయక్రాంతి):  ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ర్టంలోని అన్ని నగరాలు, పట్టణాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. రాష్ర్టంలోని 130 మున్సిపాలిటీలకు వివిధ పథకాల ద్వారా రూ. 17,472.22 కోట్లు విడుదల చేసింది. వీటితో దాదా పు 3,994 అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం ప్రత్యేక చొరవ చూపటంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ శాఖలో సంస్కరణలు చేపట్టారు. రోడ్లు రహదారుల నిర్మా ణం, వరద నిర్వహణ నియంత్రణ పనులు, చెరువు ల్లో కాలుష్యాన్ని అరికట్టడం, కాలనీలు, బస్తీల్లో సౌకర్యాలు కల్పించడం, పబ్లిక్ పార్కులు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలను మెరుగుపరచడానికి ఈ నిధులను ప్రణాళికాబద్ధంగా  వినియోగించింది. పరిపాలన సౌలభ్యంతో పాటు అన్ని పట్టణాల అభివృద్ధి, మెరుగైన పౌర సేవలు, పర్యవేక్షణకు వీలుగా సంస్కరణలు అమల్లోకి తెచ్చారు.

మున్సిపల్ శాఖను రెండుగా విభజన.. 

ఉమ్మడి రాష్ర్టం నుంచి ఒకే శాఖగా ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌ను రెండుగా విభజించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అర్బన్ విభాగంగా ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నియమించారు. కోర్ అర్బన్ ఏరియా వెలుపల ఉన్న మున్సి పాలిటీలు, కార్పొరేషన్లను మరో విభాగంగా ఏర్పా టు చేసి మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు.

హైదరాబాద్ తరహాలో రాష్ర్టంలోని అన్ని నగరాలు, పట్టణాలను అభివృద్ధి చేయాలనే భవిష్యత్తు ఆలోచనలతో సీఎం రేవంత్‌రెడ్డి  స్వయం గా ప్రణాళికలు తయారు చేయించారు. 2019 నుంచి పెండింగ్‌లో ఉన్న స్టాంప్ డ్యూటీ నిధులు  రూ. 996.27 కోట్లను పట్టణాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. గతంలో రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు ప్రారంభానికి నోచుకోలేదు.

ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వాటాను వెంటవెంటనే విడుదల చేస్తుండటంతో,  పెండింగ్ లో ఉన్న అన్ని పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రాల ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (ఎస్‌ఏఎస్‌సీఐ) పథకం కింద అవసరమైన కీలక సంస్కరణలను ప్రభుత్వం పూర్తి చేసింది. దాంతో సంస్కరణల అనుసంధాన సహాయంగా రూ.1,698 కోట్ల నిధులను పొందేందుకు తెలంగా ణ అర్హత సాధించడం విశేషం.

రెండేండ్లలో రూ. 17472.22 కోట్లు కేటాయింపులు

* నగరాభివృద్ధి, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి (యూఐడీఎఫ్)  నిధి కింద   130 మున్సిపాలిటీల్లో 2,374 పనులకు రూ. 9,387.11 కోట్లు. 

* తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ పథకం కింద  85 మున్సిపాలిటీల్లో 1,166 పనులకు రూ.1,896.96 కోట్లు. 

* ట్రాన్స్-ఫర్ డ్యూటీ కింద 110 మున్సిపాలిటీల్లో రూ.462.19 కోట్లు.

* స్వచ్ఛ భారత్ పథకంలో 236 మున్సిపాలిటీల్లో 347 పనులకు  రూ. 462.19 కోట్ల (ఇందులో రాష్ట్ర వాటా రూ. 286.20 కోట్లు, కేంద్ర వాటా రూ.175.99 కోట్లు). 

* ఏఎంఆర్ యూటీ పథకం కింద 109 మున్సిపాలిటీల్లో 107 పనులకు రూ. 4,729.69 కోట్లు.