08-02-2026 12:00:00 AM
జెలెన్‌స్కీకి చిక్కులు
ఉక్రెయిన్- -రష్యా యుద్ధం జూన్‌లోపు ముగియాలని తాజాగా అగ్రరాజ్యం డెడ్‌లైన్ విధించింది. ఈ సవాల్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కత్తిమీద సాములా మారింది. ఒకవైపు రష్యా తనకు డాన్బాస్ ప్రాంతాన్ని అప్పగించాలని కోరుతుండగా, డెడ్‌లైన్‌లోపు యుద్ధం ముగించకుంటే ఉక్రెయిన్‌కు సైనికపరమైన సహాయ, సహకారాలు నిలిచిపోతాయని అగ్రరాజ్యం తెగేసి చెబుతోంది.
శాంతివారధి ఖేమ్‌చంద్
మణిపూర్ రాజకీయ యవనికపై నిబద్ధతకు నిలువెత్తు రూపం ఖేమ్‌చంద్ సింగ్. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. సంక్లిష్ట సమయాల్లోనూ సంయమనం కోల్పోని స్థితప్రజ్ఞుడిగా, వివాదరహితుడిగా ఆయనకు గుర్తింపుఉంది. అంతేకాదు.. ఏకకాలంలో ఆయన మైతీ, కుకీ-జో వర్గాల మధ్య సయోధ్య కుదర్చగల నేత. అందరికీ ఆమోదయోగ్యుడు కాబట్టే.. బీజేపీ అధిష్ఠానం ఆయనకు సీఎం పీఠాన్ని కట్టబెట్టింది.