14 July, 2026 | 11:47 AM

Breaking News

కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •  

అశాస్త్రీయంగా వర్గీకరణ

19-03-2026 02:04 AM

ది నేషనల్ అంబేద్కర్ సేన,మాల సంఘాల డిమాండ్

ముషీరాబాద్, మార్చి 18(విజయక్రాంతి): అశాస్త్రీయమైన ఎస్సీ ఉపవార్ఘీకరణతో మాలలు, మాల ఉప కులాలకు అన్యాయం జరిగిందని, రోస్టర్ పాయింట్లను రెండు నుంచి పదిలోపు రెండుసార్లు సవరించాలని ది నేషనల్ అంబేద్కర్ సేన, మాల సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించాయి. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ది నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షులు మన్నె శ్రీధర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు తాలూకా రాజేష్, మాల మహానాడు జాతి అధ్యక్షులు తాళ్లపల్లి రవి తదితరులు మాట్లాడారు.

పెరిగిన మాలల జనాభా ప్రకారం మూడు శాతం రిజర్వేషన్లను పెంచి, 26 మాల ఉప కులాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం బషీర్ బాగ్ నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావుకు వినతిపత్రం సమర్పించేందుకు పాదయాత్రగా బయలుదేరిన మాల సంఘాల నాయకులను అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమావేశంలో నేతలు వినయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, కళ్యాణ్ రామ్, కమల్ కుమార్, సత్యనారాయణ, రాజారావు, గిరిజా శంకర్, వినయ్ కుమార్, రవి, అనిల్, నరసింహ, సంజీవ, సైదులు, సత్తన్న, మన్మోహన్ పాల్గొన్నారు.