ఉపాధ్యాయుల సమస్యలపై సమరశంఖం
25-08-2026 07:57 PM
నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న ఉపాధ్యాయుల మహాధర్నాకు నాగల్‌గిద్ద మండలం నుంచి అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని మండల పీఆర్టీయూ అధ్యక్షులు శేరికర్ రమేష్ కార్యదర్శి జీవన్ రావు పాటిల్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ధర్నా నోటీసు అందించినట్లు తెలిపారు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, హెల్త్ కార్డుల అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్నాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శేరికర్ రమేష్, జీవన్ రావు పాటిల్ కోరారు.






