పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేని పరామర్శించిన కేంద్రమంత్రి బండి సంజయ్
04-03-2026 01:50 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి(Gujjula Ramakrishna Reddy) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదారబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Union Minister Bandi Sanjay) బుధవారం ఆసుపత్రికి వెళ్లి రామకృష్ణ రెడ్డిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని వైద్యులతో మాట్లాడిన అని త్వరలోనే కొలుకుంటారని దైర్యం చెప్పారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య తదితరులు పాల్గొనారు.




