4 May, 2026 | 12:30 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

మక్కా రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: హరీష్ రావు

04-03-2026 01:22 PM

కొనుగోలు కేంద్రాలు లేక అన్నదాతల అరిగోస

నంగునూరు,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) ఎక్స్ వేదికగా విమర్శించారు. సాగు పెట్టుబడి సాయం అందించడంలో విఫలమైన రేవంత్ సర్కార్, కనీసం పండించిన పంటను కొనుగోలు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఆరేపల్లి గ్రామంలో 350 ఎకరాల్లో మక్క సాగు చేసిన రైతులు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు అల్లాడుతున్నారనిన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని,కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, రవాణా సౌకర్యాల లేమి, చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆరేపల్లితో పాటు అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధర (ఎమ్మెస్పి) చెల్లించి మక్కలను సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు.