24 July, 2026 | 7:17 PM

కార్పొరేషన్ కార్పొరేటర్లు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలి

24-07-2026 06:16 PM

పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల 

పాత పాల్వంచ 46వ డివిజన్ లో కార్పొరేటర్ విమలాదేవితో కలసి పర్యటించిన కొత్వాల

పాల్వంచ,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్ కు ఎన్నికైన డివిజన్ కార్పొరేటర్ లు తమ ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని పాల్వంచ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, డి.సి.ఎం.ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని పాత పాల్వంచ 46వ డివిజన్ లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి తో కలసి కొత్వాల పర్యటించారు. కార్పొరేషన్ అధికారులతో కలసి పాత పాల్వంచ లోని గడియ కట్ట, జెండాల బజార్, పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంతాల్లో ప్రజలను కలుసుకొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లు, అధికారులు  పర్యటించాలన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా పారిశుధ్యం (శానిటేషన్), నాణ్యమైన త్రాగునీరు, రోడ్డు, డ్రైన్ సౌకర్యాలు, దోమల నివారణకు ఫాగింగ్ వంటిబి చర్యలు చేపట్టాలని కొత్వాల అన్నారు.