విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ
బిఆర్ఎస్, బిజెపి పేపర్ లీకేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): దేశాన్ని 10 ఏళ్లుగా పాలిస్తున్న బిజెపి ప్రభుత్వం పాలనలో ఇప్పటికే 152 సార్లు పరీక్ష పేపర్లు లీక్ చేసి విద్యార్థుల జీవితంతో చెలగాటమడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడినారు. దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ కేంద్రం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేరాలని విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్లతో 24 రోజులుగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చీమకుట్టినట్లు లేదన్నారు.
గత రెండు రోజుల క్రితం చలో పార్లమెంటు లో పాల్గొన్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అక్కడి పోలీసులు ప్రవర్తించిన విధానం భారత ప్రజాస్వామ్యం తలదించుకొని సభ్య సమాజం ముందు చిదరించుకునే విధంగా విద్యార్థులపై లాఠీ ఛార్జ్, భాష గోళాల ప్రయోగం, నీటి ఫిరంగులు, విచక్షణ రహితంగా దాడులు చేశారని వారు ఆరోపించారు. ఇక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో తప్పించుకోలేరని గతంలోనే రైతు పోరాటంలో వెనుకడుగు వేసిన ఈ ప్రభుత్వం విద్యార్థుల పోరాటానికి దిగిరాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మీడియా సెల్ కన్వీనర్ సి జే బెనహర్, పార్టీ సీనియర్ నాయకులు బేక్కరి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






