23 July, 2026 | 3:43 AM

వినియోగదారుల చెంతకు యూనియన్ బ్యాంక్

23-07-2026 12:00 AM

డిజిటల్ లావాదేవీలపై అవగాహన

నాగర్‌కర్నూల్ జూలై 22 (విజయక్రాం తి): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం బ్రాంచ్ మేనేజర్ ఎస్.విరిత  ఆధ్వర్యంలో ‘షాప్ టు షాప్‘ వినియోగదారుల సేవా కార్యక్రమాన్ని  చేపట్టా రు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎల్డీఎం చంద్రశేఖర్ పాల్గొని విని యోగదారులకు పలు సూచనలు, సలహాలు అందించారు.

ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని అన్ని శాఖల మేనేజర్లు, అధికారులు, క్లరికల్, సబార్డినేట్ సిబ్బంది వ్యాపార సం స్థలు, దుకాణాలను ప్రత్యక్షంగా సందర్శించి వినియోగదారుల అవసరాలను తెలుసుకున్నారు. వారికి అవసరమైన బ్యాంకింగ్ సేవ లు, ఆర్థిక పరిష్కారాలపై అవగాహన కల్పి స్తూ వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులను పరిచ యం చేశారు.

ఈ సందర్భంగా పొదుపు, కరెంట్ ఖాతాలు, వ్యక్తిగత, గృహ, ఎంఎస్‌ఎంఈ, వ్యవసాయ రుణాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, బీమా, పెట్టుబడి పథకా లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించారు. సురక్షితమైన, సులభమై న డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని వినియోగదారులను ప్రో త్సహించారు.

ఈ కార్యక్రమానికి వినియోగ దారుల నుంచి విశేష స్పందన లభించింద ని, వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు పనిచేస్తున్నామని బ్యాంక్ సిబ్బంది పేర్కొన్నారు.  వారితోపాటు డీబీహెచ్ అంగ్షుమాన్ దాస్, అసిస్టెంట్ మేనేజ ర్ షేక్ ఆయేషా సుల్తానా, సిఎస్‌ఏలు శ్రీలేఖ, అనూష, సిబ్బంది లక్ష్మణ్ ఉన్నారు.