23 July, 2026 | 4:23 AM

రాజకీయ పోస్టులు పెడుతున్న ఉపాధ్యాయుడు

23-07-2026 12:00 AM

బోరు కృష్ణయ్యపై బిజెపి నేతల ఫిర్యాదు 

గండీడ్, జూలై 22 : ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయుడిగా బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై అవాస్తవ ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని ఉపాధ్యాయుడు బోరు కృష్ణయ్య పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కేంద్ర మంత్రులపై తప్పుడు ప్రకటనలు సోషల్ మీడియాలో చేస్తున్నారని ఈ విషయంపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి తప్పుడు ప్రచారం చేసిన బోరు కృష్ణయ్య పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో... మహమ్మదాబాద్ మండల అధ్యక్షులు మూస నర్సింలు, మాజీ మండల అధ్యక్షులు ప్రభు నాయక్, కురువ కృష్ణ, గండీడ్ మండల ఉపాధ్యక్షులు గడ్డమీది మల్కయ్య, బద్రిశ్వర్, మండల బీజేవైఎం అధ్యక్షులు యాదగిరి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాజీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బాలయ్య, మండల బిజెపి నాయకులు నరహరి రెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణయ్య, కృష్ణారెడ్డి, మోహన్, జ్ఞానేశ్వర్, నరేష్, సురేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.