4 March, 2026 | 3:49 AM

తెల్లవారుజామునే.. కలప అక్రమ రవాణాకు సమయం

04-03-2026 12:11 AM

జడ్చర్లలో అడ్డు అదుపు లేకుండా కలప సరఫరా

అధికారుల మౌనం ఎందుకో

జడ్చర్ల, మార్చి 3: తెల్లవారుజామున నిశ్శబ్దంగా అక్రమ కలప రవాణా జరుగుతు న్నా,సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.ప్రతి రోజు ఉదయం తెల్లవారుజామున అడవీ ప్రాంతాల నుంచి భారీగా విలు వైన కలపను లారీల్లో, ట్రాక్టర్లలో తరలిస్తున్న అక్రమ రవాణాదారులు& ఎలాంటి భయభ్రాంతులు లేకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

స్థానికుల సమాచారం ప్రకారం, ఈ అక్రమ రవాణా చాలా కాలం గా జరుగుతున్నా, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సరైన చర్యలు తీసు కోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు, ఈ అక్రమ రవాణాపై ఫిర్యాదులు అందుతున్నప్పటికీ, తెలంగాణ పోలీస్ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి.

అడవుల సంరక్షణకు ప్రభుత్వం కోట్లాది రూపా యలు ఖర్చు చేస్తున్నా, ఇలాంటి అక్రమ కార్యకలాపాల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవుల నాశనం వల్ల వర్షపాతం తగ్గడం, వన్యప్రాణుల నివాసం దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయి.

అధికారుల తీరుపై ప్రజల అసంతృప్తి 

పగలు ఎవ్వరూ పట్టించుకోరు& రాత్రి, తెల్లవారుజామునే అక్రమంగా కలప తరలిస్తున్నారంటు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి, అక్రమ కలప రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రాత్రి, తెల్లవారుజామునే అక్రమ రవాణా

అక్రమ రవాణాదారులు ఎక్కువగా రాత్రి పూట, తెల్లవారుజామున వేళల్లోనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో రహదారులపై ట్రాఫిక్ తక్కువగా ఉండటం, తనిఖీలు లేకపోవడంతో నిర్భయంగా వాహనాలు నడుపుతున్నారు. అక్ర మ కలప రవాణా వల్ల అటవీ సంపద తీవ్రంగా నష్టపోతోంది. చెట్ల నరికివేత వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాల స్థాయి పడిపోవడం, వన్యప్రాణుల నివాస ప్రాంతాలు నాశనం కావడం వంటి అనేక సమస్యలకు ఇది కారణమవుతోందని వారు చెబుతున్నారు. అక్రమ రవాణాపై అధికారులు స్పందించకపోవడంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్త మవుతోంది. తమ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.‘రోజూ తెల్లవారుజామున వాహనాలు వెళ్తున్నాయి. మేము చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు‘ అంటూ స్థానికులు వాపోతున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

అక్రమ కలప రవాణాపై వెంటనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. రహదారులపై చెకోపోస్టులు ఏర్పాటు చేయాలని, నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల స్పందన కోసం ఎదురుచూపు

ఈ ఘటనపై సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికైనా స్పందించి, అక్రమ రవా ణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. లేకపోతే అటవీ సంపద పూర్తిగా నశించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే, ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.చూడాలి మరి& ప్ర భుత్వం, అధికారులు ఎప్పుడు మేలుకుంటారో..అక్రమ రవాణాకు ఎప్పుడు చెక్ పెడతారో ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తుండ్రు.