18 May, 2026 | 2:50 AM

కోనరావుపేట మండల ఉపసర్పంచుల ఫోరం ఏకగ్రీవ ఎన్నిక

18-05-2026 01:52 AM

కోనరావుపేట, మే 17(విజయక్రాంతి):కోనరావుపేట మండలంలోని 28 గ్రామాల ఉపసర్పంచులు ఆదివారం సమావేశమై మండల స్థాయి ఉపసర్పంచుల ఫోరంను ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫోరం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఫోరం అధ్యక్షుడిగా నిజామాబాద్ గ్రామానికి చెందిన లంబ రాజు, ఉపాధ్యక్షుడిగా వట్టిమల్ల గ్రామానికి చెందిన గంగారాం సంపత్, ప్రధాన కార్యదర్శిగా బావుసాయిపేట గ్రామానికి చెందిన తిక్కల నవీన్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సభ్యు లు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఉపసర్పంచుల హక్కు ల పరిరక్షణ కోసం సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ఉపసర్పంచులు ఐక్యంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.