18 May, 2026 | 2:48 AM

నిరుపేద ప్రజలకు గొప్ప వరం

18-05-2026 01:50 AM

అలంపూర్ మే 17: నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి గొప్ప వరమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.ఆయన ఆదివారం కర్నూలులోని ఎమ్మెల్సీ చల్లా నివాసంలో బాధితుడికి సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. మానవపాడు మండల కేంద్రానికి చెందిన రఫిక్ అహ్మద్ కు రూ.51,000 విలువైనా చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ రెడ్డి,రిటైర్డ్ లెక్చరర్ దేవసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పరామర్శ

అయిజ పట్టణ కేంద్రంలో పారిశుధ్య కార్మికురాలు పద్మమ్మ శనివారం తెల్లవారు జామున విధి నిర్వహణలో భాగంగా రోడ్డును శుభ్రం చేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురైంది.ఆమె రెండు కాళ్లు తీవ్రంగా గాయపడి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు బాధితురాలిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.