20 March, 2026 | 1:53 PM

వెలమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

20-03-2026 01:15 AM

ముకరంపుర, మార్చి19(విజయక్రాంతి): ఉగాది పండుగను పురస్కరించుకుని కరీంనగర్ పద్మనాయక  కళ్యాణ మండపములో ఉగాది పండుగ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకకు చెల్మెడ విద్యా సంస్థల అధినేత లక్ష్మి నరసింహ రావు హాజరయ్యారు. వేద పండితులు పంచాంగా న్ని పఠనం చేశారు. అనంతరం ఉగాది పచ్చడినీ అందించారు.

ఈ సందర్భంగా.. చెల్మెడ లక్ష్మీ నరసింహా రావు మాట్లాడుతూ ఈ పరాభవ నామ సంవత్సరం అందరికి శుభా లు కలగాలని అందరికి మంచి చేయాలని.. మంచి పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ వే డుకలోవెలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాల్ రావు, ఉపాధ్యక్షులు గండ్ర సం పత్ రావు ,ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాష్ రావు ,కోశాధికారి భీమ్ రావు, సంయుక్త కార్యదర్శి భూపతి రావు కార్యవర్గ సభ్యులు.. వెలమ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.