22 April, 2026 | 3:01 PM

Breaking News

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన   •   చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •  

యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్

07-04-2026 12:06 AM

ముంబై, ఏప్రిల్ 6: దేశవ్యాప్తంగా చిన్నారుల్లో ఉండే క్రీడానైపుణ్యాన్ని వెలికితీసేందుకు నిర్వహిస్తున్న యూబీఎస్ అథ్లెటిక్స్ కిడ్స్ కప్ 2026 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. గత రెండేళ్లుగా నిర్వహించిన ఈ పోటీలకు అద్భుతమైన స్పందన కనిపించడంతో మరిన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించారు.

ఈ సారి 10 లక్షల మంది చిన్నారులే లక్ష్యంగా అథ్లెటిక్స్ కిడ్స్ కప్‌ను నిర్వహించబోతున్నారు. ప్రముఖ జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ముంబై, పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్,చెన్నైలతో పాటు మరిన్ని నగరాల్లో అథ్లెటిక్స్ కిడ్స్ కప్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.రన్నింగ్ , జంపింగ్, త్రోయింగ్ ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. 7 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల్లో క్రీడానైపుణ్యాన్ని గుర్తించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.