17 April, 2026 | 1:29 PM

ప్రాణం తీసిన రాంగ్ రూట్.. కారు ఢీకొని వ్యక్తి మృతి

17-04-2026 12:16 PM

చేర్యాల,ఏప్రిల్ 17: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వీరన్నపేట స్టేజీ వద్ద అతివేగంలో ఉన్న కారు రాంగ్ రూట్ లో వెల్లి ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినాడు. చేర్యాల మండల కేంద్రానికి చెందిన తొడెంగుల నర్సింహులు(46) రోజు మాదిగానే తన ఎక్సల్ పై ఆకుకురుల వ్యాపార నిమిత్తం చుట్టూ పక్కల గ్రామాలకు వెళ్ళేవాడు.

శుక్రవారం ఉదయం కుడా చేర్యాల నుండి విఎస్ఆర్ నగర్,కట్కూర్ గ్రామానికి వెళ్తున్న క్రమాంలో జనగాను నుండి సిద్దిపేట వైపు వస్తున్న కారు అతివేగంగా అజాగ్రత్తగా రాంగ్ రూట్లో వచ్చి ఎదురుగ వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని డికోనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.కారులోని వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.మృతునికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు.