17 April, 2026 | 12:59 PM

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం

17-04-2026 11:47 AM

న్యూఢిల్లీ: నామినేటెడ్ సభ్యుడు హరివంశ్(Harivansh Narayan Singh) శుక్రవారం రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభలో ఉపసభాపతి ఎన్నిక కోసం జేపీ నడ్డా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పాత్రికేయుడిగా ఉండి రాజకీయ నాయకుడిగా మారిన ఈయనకు, ఉపసభాపతిగా ఇది మూడవ పర్యాయం. ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగిసిన తర్వాత, రాజ్యసభ ఉపసభాపతి పదవి ఖాళీ అయ్యింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్(Deputy Chairman of the Rajya Sabha) ఎన్నికైన హరివంశ్ ను రాజ్యసభ సభ్యులు అభినందించారు. రాజ్యసభలో, హరివంశ్ నారాయణ్ సింగ్ మూడవసారి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైనందుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇది సభకు ఆయనపై ఉన్న ప్రగాఢ విశ్వాసానికి నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.