30 August, 2026 | 12:20 AM

Breaking News

ఫారంపాండ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్   •   స్నేహితుడి కుటుంబానికి 1996 బ్యాచ్ ఆపన్నహస్తం   •   కనుగుట్ట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా: ఎంపీ జి.నగేష్   •   గోపాల్‌పేట్‌లో పచ్చదనం పరిమళించాలి   •   నాచారం పోలీస్ స్టేషన్ సందర్శించిన చైతన్య స్కూల్ విద్యార్థులు   •   కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి వెళ్లిన వర్గవిబేధాలు   •   దోమకొండ సింగల్ విండో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం   •   రాత్రిపూటా ఆర్టీసీ రయ్ రయ్   •   అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు   •  

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు మేలు

29-06-2026 12:00 AM

నేతివానిపల్లి సర్పంచ్ పద్మ వెంకటేష్ నాయక్

మల్దకల్, జూన్ 28: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సర్పంచ్ పద్మ వెంకటేష్ నాయక్ ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని శాశ్వతంగా నివారించవచ్చని తెలిపారు. చిన్నారుల్లో అంగవైకల్యాన్ని నివారించి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.