1 September, 2026 | 11:33 PM

తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

01-09-2026 | 10:45pm

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామానికి సంబంధించిన రేషన్‌ షాపు నంబర్లు 5, 6, 7 పరిధిలోని లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను గ్రామ సర్పంచ్ అంది రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత, సౌలభ్యం కలుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భరత్,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, జిపిఓ, అంగన్వాడీ టీచర్ ఐకెపి సిసి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.