12 June, 2026 | 11:45 PM

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

12-06-2026 10:20 AM

నవాబ్ పేట: జనగామ జిల్లాలో(Jangaon District) శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లింగాలఘన్ పూర్ మండలం నవాబ్ పేట వద్ద లారీ-కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందాగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను హనుమకొండకు చెందిన ఇమ్రాన్, సుభాన్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.