7 March, 2026 | 12:14 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

07-03-2026 10:34 AM

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు 

10 పదిమందికి గాయాలు 

అడ్డాకుల: మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) ఉమ్మడి మండలం అడ్డాకుల మూసాపేట, పొన్నకల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా డివైడర్ దాటుకొని బస్సుఆర్టీసీ బస్సు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద ధాటికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. లారీలు ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బస్సు డ్రైవర్ కు కాళ్ళు విరగడంతో పాటు పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. రోడ్డు పక్కన పడ్డ  మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను కొత్తకోటకు చెందిన నాగన్న, లారీ డ్రైవర్ కొత్తకోట మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన రవి, బస్సు డ్రైవర్  మహబూబ్ నగర్ వెనుగొండ చెందిన పురుషోత్తం నికి రెండు కాళ్లు విరిగిపోయాయి, చెయ్యి విరిగిపోయింది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని  108 అంబులెన్స్ సిబ్బంది కిషోర్, శ్రీనివాసులు,  అత్యవసర చికిత్స  పురుషోత్తన్ని, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు మూసాపేట ఎస్సై వేణు వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. .ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.