26 April, 2026 | 8:53 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

నార్కెట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

10-03-2026 10:59 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి ఫ్లైఓవర్(Narketpally Flyover) సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓవర్ టేక్ చేస్తూ ట్రావెల్స్ బస్సు లారీని తాకుతూ ముందుకెళ్లింది. అనంతరం లారీ, ట్రావెల్స్ బస్సును రహదారి పక్కన ఆపి డ్రైవర్లు ఘర్షణకు దిగారు. లారీ వెనకాల ఉండి ఘర్షణ పడుతుండగా వేగంగా దూసుకొచ్చిన మరోలారీ వారిని వెనుకనుండి ఢీకొట్టింది.

రెండు లారీల మధ్యలో ఇరుక్కుపోయి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను శ్రీనివాస్, బంగారయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.