29 June, 2026 | 10:04 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

ఇరాన్ యుద్ధ ప్రభావం.. దేశంలో గ్యాస్ సంక్షోభం!

10-03-2026 12:46 PM

న్యూఢిల్లీ: ఇరాన్(Iran war)పై ఇజ్రాయెల్ యుద్ధంతో గ్యాస్ సంక్షోభం(Gas Crisis) నెలకొంది. దేశంలో గ్యాస్(India Gas Crisis) కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర వస్తువుల చట్టం ప్రయోగించింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించకుండా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా పెట్రోలియం శాఖ చర్యలు తీసుకుంది. 

వంట గ్యాస్‌కే ముందుగా ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. వంద శాతం గృహ ఉపయోగానికే గ్యాస్ వినియోగించేలా చర్యలు తీసుకుంది. ఎల్పీజీ పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పీఎన్ జీ, సీఎన్ జీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. ఎరువుల ప్లాంట్లకు 70 శాతం, పరిశ్రమలకు 80 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టుంది.


ఇవి కూడా చదవండి:

22 ఏళ్లుగా ‘నో స్మోకింగ్’ పోరాటం.. రఘునందన్‌కు జాతీయ హీరో అవార్డు

తెలంగాణ బడ్జెట్ 2026-27.. రూ.3.25 లక్షల కోట్లకు చేరే అవకాశాలు

నార్కెట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి