25 February, 2026 | 3:29 PM

గుంతను తప్పించబోయి రెండు బైకులు ఢీ

25-02-2026 01:00 PM

నలుగురికి గాయాలు. 

గుంతల మయమైన రోడ్డే కారణం. 

తాండూరు, ఫిబ్రవరి 25,(విజయక్రాంతి): రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఓకే వరుసలో వెళుతున్న రెండు బైకులు ఢీకొని నలుగురికి గాయాలు అయిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దెములు గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ వైపు నుండి కుటుంబంతో వెళుతున్న బైక్ తో పాటు మరో బైక్ ఒకే వరుసలో తాండూర్ వైపుకి వెళుతున్నాయి.

అయితే బుద్ధారం వాగు బ్రిడ్జ్ సమీపంలో ఉన్న గుంతల మయంగా మారిన రోడ్డుపై  గుంతను తప్పించబోయి మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో పల్సర్ బైక్ ముళ్లపోదల్లోకి దూసుకుపోయింది. పల్సర్ బైక్ పై ప్రయాణిస్తున్న ఓ మహిళకు మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ లో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణం గుంతల మయమైన రోడ్డే నని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు రోడ్డును మరమ్మతులు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని వారు కోరుతున్నారు.