15-02-2026 12:50:55 AM
పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతాం:టీఆర్పీ నేతలు
విజయనగర గ్రామంలో గడప గడపకు కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం(మణుగూరు), ఫిబ్రవరి 14(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆశయాలను, పార్టీ విధివిధానాలను విస్తృతంగా ప్రజల్లో కి తీసుకెళ్లాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. టీఆర్పీ మణుగూరు అధ్యక్షులు బోడపట్ల శివాజీ గౌడ్ ఆధ్వర్యంలో విజయనగర గ్రామంలో శనివారం పర్యటన భాగంలో పలు కుటుంబాలను మణుగూరు మండల మహిళా అధ్యక్షురాలు భీమిని రాజేశ్వరి గారి సమక్షంలో ఆహ్వానించారు.
గడప గడప కార్యక్రమంలో భాగంగా రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్న అభ్యర్థులకు బీ ఫార్మ్‌లు ఇచ్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఇన్‌చార్జ్జి బంధారపు నర్సయ్య గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ సూచనలు ప్రకారం గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో మణుగూరు మండల ప్రధాన కార్యదర్శి మెరుగు రఘు ,ఉపాధ్యక్షులు పెద్దోజు సతీష్,ట్రెజరర్ తాడబోయిన బుచ్చయ్య, మణుగూరు మండల యూత్ అధ్యక్షుడు కామ గాని రమేష్ గౌడ్, సహాయక కార్యదర్శి సాయి కుమార్,మణుగూరు టౌన్ అధ్యక్షు దుర్గాప్రసాద్ తదితర మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.