కోటి ఎకరాల భూ పంపిణీ చేస్తాం
2028లో బీసీ సీఎం పక్కా
కత్తెర గుర్తుతో రెడ్లు, వెలమల పార్టీలను కత్తిరిస్తాం
మెదక్ జిల్లాలో టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
మెదక్, ఆగస్టు 21(విజయక్రాంతి): రాష్ట్ర ంలో బీసీల రాజకీయ రాజ్యాధికార స్థాపనే తమ లక్ష్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెడ్డి, వెలమ దొరల రాజకీయాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
2028 ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ధ్యేయమని ఆయన ప్రకటించారు. టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం జిల్లాలోని 15 గ్రామాల్లో పార్టీ జెండా గద్దెలను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో తీన్మార్ మల్లన్న పాల్గొని ప్రసంగించా రు. ఇదే సభలో పలువురు యువకులు, వివి ధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్పీలో చేరగా, వారికి మల్లన్న పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
దుబ్బాక నియోజకవర్గంలో అత్యధిక ఓటు బలం బీసీలు, ఎస్సీలు, ఎస్టీ లు, మైనారిటీలదేనని, అయినప్పటికీ రెడ్డి, రావులే అధికారాన్ని శాశ్వతంగా తమ చేతు ల్లో ఉంచుకున్నారని మల్లన్న మండిపడ్డారు. బీసీలు అందరూ రాజకీయంగా ఐక్యమైతే అధికార మార్పు ఖాయమన్నారు.పార్టీ ఎన్నికల గుర్తు కత్తెర బీసీ వృత్తి కులాల జీవన విధానానికి ప్రతీక అని మల్లన్న పేర్కొన్నారు. కత్తెరతోనే దొరల పెత్తన రాజకీయాలకు రాజకీయ ఆపరేషన్ చేయబోతున్నామని తెలిపారు.
కష్టజీవుల చెమటతో నిర్మితమైన తెలంగాణలో అధికారమూ వారికే దక్కాలన్నారు. రాష్ట్రంలోని భూములు, సహజ వనరులపై బహుజనులకు న్యాయమైన వాటా దక్కాలని మల్లన్న డిమాండ్ చేశారు. కోటి ఎకరాల భూమిని రెడ్లు, వెలమలు వం టి వర్గాలు తమ ఆధీనంలో ఉంచుకుని జాగీరులా అనుభవిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను తిరిగి స్వాధీ నం చేసుకుని బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు సమానంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి నగేష్ ముదిరాజ్,జిల్లా అధ్యక్షులు యాదగిరి గౌడ్,రాష్ట్ర కార్యదర్శి రమేష్ యా దవ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సురేష్ ,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్,రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్ర వీణ్,యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వీరమల్లు అనిల్,జిల్లా నాయకులు చంద్రశేఖర్, నర్సింగ్, భిక్షపతి, గౌతమ్, శ్వేతతో పా టు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎంజీపీ గురుకుల పాఠశాల సందర్శన
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఎంజీపీ గురు కుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వస తి, ఆహార ఏర్పాట్లు, ఉపాధ్యాయుల పనితీరు తదితర అంశాలను పరిశీలించారు.
అన ంతరం మల్లన్న మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, పోటీ పరీక్షలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన అంశాలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని మల్ల న్న హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్పీ నేతలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీఆర్పీ జెండాల ఆవిష్కరణ
టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మహమ్మద్ నగర్, కౌడీపల్లి, కోల్చారం, మెదక్ టౌన్‌లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు రాజకీయ అధికారం సాధించడమే టీఆర్పీ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సముచిత హక్కులు, అవకాశాలు కల్పించే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
2028లో బీసీ బీ-ఫామ్‌తో చరిత్ర తిరగరాస్తాం
బీసీలు ఐక్యంగా నిలిస్తే రాష్ట్రంలో రా జ్యాధికారం సాధించడం ఖాయమని తెల ంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ లు జనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ శాసనసభ, పార్లమెంట్, మంత్రివర్గం, కీల క నిర్ణయాత్మక స్థానాల్లో తగిన ప్రాతిని ధ్యం లేదని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశా రు. బీసీలు కేవలం ఓటు బ్యాంక్‌గా కాకుం డా పాలక వర్గంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్పీ ఆధ్వర్యంలో బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా ‘సర్జికల్ స్ట్రైక్ 59’ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
శుక్రవారం తెలంగాణలోని పలు నియోజకవర్గాల సామాజిక గణాంకాలు, ఓటర్ల లె క్కలు, రాజకీయ సమీకరణాలను విశ్లేషి స్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సం ఖ్యాబలం బీసీలదైనా, రాజకీయ అధికారం మాత్రం రెడ్ల చేతుల్లోనే కొనసాగు తోందని మల్లన్న మండి పడ్డారు. 2028 లో హుజూర్‌నగర్ నుంచి టీఆర్పీ బీసీ బీ-ఫామ్‌తో బలమైన అభ్యర్థిని నిలబెట్టి కొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం చుడుతామని వెల్లడించారు. మిర్యాలగూడలో బీసీ శక్తి ఉప్పెనలా మారబోతోంది అన్నా రు. కల్వకుర్తి కోటపై బీసీ జెండా ఎగరేస్తామని మల్లన్న దీమా వ్యక్తం చేశారు.






