2 August, 2026 | 2:44 AM

ట్రిపుల్ జంప్ డబుల్ ధమాకా

02-08-2026 12:58 AM

పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. ప్రవీణ్ చిత్రావేల్ 16.58 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించగా, మరో అథ్లెట్ సెల్వ ప్రభు 16.52 మీటర్లు దూకి కాంస్య పతకం గెలుచుకున్నాడు.  ప్రవీణ్ చిత్రావేల్ 2022 ఆసియా క్రీడలలో కాంస్య పతకాన్ని , 2025 ఆసియా ఛాంపియన్‌షిప్ , 2023 ఆసియా ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతకాలను సాధించాడు. తన కెరీర్ ప్రారంభంలో 2018 యూత్ ఒలింపిక్ క్రీడలలో కూడా కాంస్య పతకాన్ని సాధించాడు.

ఇక సెల్వ ప్రభు 2023లో గ్రీస్ వేదికగా జరిగిన అంతర్జాతీయ  మీట్‌లో 16.78 మీటర్ల దూరం దూకి తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో పాటు భారత జూనియర్ జాతీయ రికార్డును నెలకొల్పాడు. దీనితో అతను భారత ఆల్-టైమ్ జాబితాలో టాప్-10లో చేరాడు.