షాట్ పుట్‌లో సోమన్‌కు స్వర్ణం
గ్లాస్గో, ఆగస్టు 1 : పారా అథ్లెటిక్స్ లోనూ భారత క్రీడాకారులు చిరస్మరణీయ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పురుషుల షాట్ పుట్‌లో సోమన్ రా ణా స్వర్ణం గెలుచుకోగా, శుభమ్ జుయల్ రజతం సాధించారు. కామన్వెల్త్ పారా షాట్ పుట్‌లో భారత్‌కు ఇదే తొ లి స్వర్ణం అలాగే డబుల్ పోడియం (స్వర్ణం, రజతం) విజయం.
సోమన్ రాణా భారత సై న్యంలో సేవలు అందిస్తున్న సమయంలో జ రిగిన ల్యాండ్ మైన్ పేలుడులో కుడి కాలు ను కోల్పోయారు. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి దేశా నికి పసిడి అందించారు. సోమన్ రాణా బీ హార్లోని గయా జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు.దేశ రక్షణలో కాలు కోల్పోయినా, పట్టుదలతో క్రీడా మైదానంలో దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సోమన్ రాణా విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు.






