22 April, 2026 | 7:20 PM

Breaking News

ఆర్టీసీ సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు   •   గొర్రెల కాపరికి న్యాయం చేసిన పట్టణ సీఐ శివశంకర్   •   వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు   •   గజ్వేల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వార్షికోత్సవం   •   జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అర్హత సాధించిన బెల్లంపల్లి సీఓఈ విద్యార్థులు   •   అకాల వర్షం – అన్నదాత ఆగమాగం   •   ప్రభుత్వ వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు   •   కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: రవినాయక్   •   నకిలీ బిల్లులతో రూ.72 లక్షల దుర్వినియోగం   •  

పాపకంటి శేఖర్‌కు ఘనంగా నివాళులు

19-02-2026 12:00 AM

షాద్‌నగర్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): అమరవీరుల స్థూపం దగ్గర తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా కళాకారుడు తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ పాప కంటి శేఖర్ 11వ వర్ధంతి కార్యక్రమాన్ని  ఘనంగా షాద్ నగర్ తాలూకా జేఏసీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.

తెలంగాణ సాధన కోసం అహర్నిశలు శ్రమించిన పాపకంటి శేఖర్ త్యాగస్ఫూర్తి, ఉద్యమ నిబద్ధత యువతకు మార్గదర్శకమని ఉద్యమ నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి తెలంగాణవాసి బాధ్యత అని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాప కంటి శేఖర్ కు జోహార్లు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తాలూకా చైర్మన్ ఏం జనార్ధన్,వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ కరుణాకర్, తాలూకా కన్వీనర్ గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్, హెల్త్ సూపర్వైజర్ జక్కుల శ్రీనివాస్, కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ మంగులాల్ నాయక్, సిఐటియు రాజు నాయక్, పాప కంటి శేఖర్ తమ్ముడు. పాపగంటి కృష్ణ, మాణిక్యం సీతారాం, భీష్వ కృష్ణయ్య, మందారం నర్సింలు, ఏఐఎస్‌ఎఫ్ పవన్, రవీంద్రనాథ్, అర్జున్ కుమార్, కేశంపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడ వీరేశం, గాయకుడు శివ  లు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.