అప్రమత్తతే వ్యాధుల నివారణకు మార్గం
మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి
మెట్ పల్లి,(విజయక్రాంతి): వర్షం కాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు అప్రమత్తతే మార్గం అని మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. శుక్రవారం డ్రై డే పురస్కరించుకొని చైర్మన్ మైలారపు లింబాద్రి పదిహేడవ వార్డులో సీజనల్ వ్యాధుల నియంత్రణే లక్ష్యంగా ఆయిల్ బాల్స్ యాంటీ లార్వా స్ప్రే మరియు బ్లీచింగ్ పౌడర్ చేయడాన్ని పరిశీలించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని వార్డులలో వర్షపు నీరు నిల్వ ఉన్నచో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. దోమల నివారణ కొరకు యాంటీ లార్వా స్ప్రే మరియు ఫాగింగ్ చేయించడం జరుగుతుందని అన్నారు.
పట్టణంలోని హెల్త్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేసి పట్టణంలో వ్యాధుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు రాకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వాటి బారి నుండి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. డ్రై డే కార్యక్రమాలను ప్రతిరోజూ నిర్వహించాలని, ప్రతి ఇంటిలో నీరు నిల్వ ఉండే కూలర్లు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పరిశీలించి, లార్వా పెరిగే ప్రదేశాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటలక్ష్మి, కౌన్సిలర్ పందిరి రమేష్, నాయకులు రాంబాబు, సానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నరేష్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.






