10 July, 2026 | 5:13 PM

ఎస్‌ఐఆర్ కొరకు రాజకీయ పార్టీల సహకారం అవసరం

10-07-2026 04:10 PM

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. ఓటరు నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పులు తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైతే నిర్ణీత గడువులోగా సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.