10 July, 2026 | 5:09 PM

పేదలకు ఒక న్యాయం.. ఉన్నవారికి మరో న్యాయమా?

10-07-2026 04:29 PM

కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి చూపు సమస్య  ఏమైనా ఉందా?

హైదరాబాద్: ఒవైసీ కళాశాల(Owaisi college) చెరువులో లైదని నమ్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ఆరోపించారు. అందిరికీ కనిపిస్తున్న అక్రమ నిర్మాణాలను హైడ్రా చూడలేకపోతుందని బండిసంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి చూపు సమస్య ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు, కాంగ్రెస్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎఫ్ టీఎల్ మారుతోందన్నారు. పేదలకు ఒక న్యాయం.. ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నవారికి మరో న్యాయామా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, ఎఫ్ టీఎల్ విషయంలో ప్రభుత్వం ద్వందవైఖరి వీడాలని హెచ్చరించారు.

''ఒవైసీ కాలేజీ ఒక సరస్సు ఒడ్డున ఉందని ప్రపంచమంతా చూడగలుగుతోంది, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలా కాదని నటిస్తూనే ఉంది. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయగలరు కానీ, అందరికీ స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆక్రమణను మాత్రం ఎందుకో గమనించడం లేదు. ఇకనైనా వాళ్లు కంటిచూపు పరీక్షించుకోవాలి. ప్రతి బీజేపీ కార్యకర్త కాంగ్రెస్ నాయకుల కోసం ఉచిత కంటిపరీక్ష శిబిరాలను నిర్వహించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలా చేసిన తర్వాత కూడా వాళ్లకు ఆ సరస్సు కనిపించకపోతే, సమస్య వాళ్ల కంటిచూపు కాదు. అది వాళ్ల రాజకీయాలే. కాంగ్రెస్ ఎక్కడ రాజకీయ రంగోలి వేయాలని నిర్ణయించుకున్నా, ఎఫ్‌టిఎల్ రేఖ అద్భుతంగా తన మిత్రులకు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.'' అని బండి సంజయ్ ఎక్స్ లో పేర్కొన్నారు.