30 August, 2026 | 6:47 PM

Breaking News

సమాజ ప్రగతికి యువత తమ ప్రతిభను వినియోగించాలి   •   మాజీ ఎంపీపీ జగన్ మోహన్‌రావుకు పరామర్శ   •   అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆలరించిన పల్లి గ్రామ భక్తులు   •   కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు జిల్లా అధ్యక్షుని కృషి   •   భగవద్గీత శ్లోక పఠన పోటీలకు విశేష స్పందన   •   ఎంఎస్‌పీ గణపురం మండల అధ్యక్షుడిగా నాగరాజు   •   నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాలు   •   మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం ఆపన్నహస్తం   •   48గంటల రిలే నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరించిన గొండ్వాన సంక్షేమ పరిషత్   •   జగన్నాధపురంలో ‘గ్రోమోర్’ కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ వినోద్   •  

ప్రియదర్శినిలోశిక్షణా కార్యక్రమం ప్రారంభం

07-07-2026 12:58 AM

ఖమ్మం హెల్త్, (విజయక్రాంతి) :ఖమ్మంలోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో ఐబీఎం స్కిల్స్బిల్డ్, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో అడ్వానస్డ్ గ్రాడ్యుయేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రాంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జూలై 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్బాబు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీ సరిపోదని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యవసరమని అన్నారు.

ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థినుల ప్రతిభను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. గోపాల్ మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, జనరేటివ్ ఎఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ప్రపంచం వేగంగా మారుతోందన్నారు. టాస్క్ జిల్లా మేనేజర్ పి. దినేష్ మాట్లాడుతూ, విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దడం టాస్క్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఎడ్యునెట్ ఫౌండేషన్ మాస్టర్ ట్రైనర్ పి. అజయ్రెడ్డి మాట్లాడుతూ, ప్రాయోగిక శిక్షణ ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలతో పాటు సమస్యల పరిష్కార సామర్థ్యం, వినూత్న ఆలోచనా విధానం పెంపొందుతాయని చెప్పారు. అకాడమిక్ డైరెక్టర్ అట్లూరి వెంకటరమణ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా కొత్త సాంకేతికతలను నేర్చుకుంటూ నిరంతర అభ్యాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఐ. నరసింహారావు, సిఎస్‌ఎం అండ్ ఎఐ విభాగాధిపతి ఎం. వెంకటేశ్వరరావు, ఈసీఈ విభాగాధిపతి డి. రమేష్, ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ తివారి మన్మోహన్, అధ్యాపకులు, పాల్గొన్నారు.