1 September, 2026 | 8:24 PM

బిజెపి నేతల అరెస్టు

01-09-2026 | 07:08pm

నిర్మల్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా(Nalgonda District)లో బిజెపి జిల్లా అధ్యక్షుడిపై దాడి ఘటనను పరామర్శించేందుకు వెళ్తున్న బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాంచందర్రావు, బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డిని(BJP leader Maheshwar Reddy) అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బిజెపి(BJP) జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను బిజెపి నేతలు ఎత్తి చూపినందుకు అరెస్టులు చేసి దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడి చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తారు. లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని తెలిపారు.