20 August, 2026 | 10:24 PM

సర్ ప్రక్రియ ఫేజ్ 2పై బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం

20-08-2026 08:06 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో గురువారం సర్ ప్రక్రియ ఫేజ్ 2లో భాగంగా బీఎల్ఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిధులుగా వరంగల్ పార్లమెంట్ ఇంచార్జి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు బీఎల్ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

ముఖ్యంగా ఓటరు జాబితాలో ఉన్న మరణించిన, డూప్లికేట్ వంటి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సరైన ఆధారాలతో సంబంధిత వివరాలను సరిచేసే విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడటంతో పాటు, తప్పుగా నమోదైన వివరాలను గుర్తించి ఎన్నికల నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ప్రతి బీఎల్ఏ తమ పరిధిలోని పోలింగ్ బూత్‌కు సంబంధించిన ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలిస్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ నాజర్, టీపీసీసీ కో ఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, దొడ్డి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.